
ఏపీఈసెట్‌లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ):
ఏపీఈసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రెండు వేరువేరు విభాగాలలో జిల్లాకు చెందిన విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన జ్యోతుల ప్రసన్నలీల బీఎస్సీ మ్యాథ్స్ స్ట్రిమ్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 88 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు. విజయవాడ మల్లికార్జునపేటకు చెందిన గొడుగుల దినేష్‌కుమార్ సివిల్ విభాగంలో 119 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి విద్యాసంస్థల్లో చేరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొలువులు పొందటం లక్ష్యంగా వివరించారు.
మద్యం వ్యసనంతో వ్యక్తి ఆత్మహత్య
పెనమలూరు: మద్యం వ్యసనం కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి గురువారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప కార్మికనగర్‌కు చెందిన బావిశెట్టి సురేష్ (39)కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. అతని చెడు అలవాట్ల కారణంగా భార్యతో విభేదాలతో కొద్ది సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం విపరీతంగా తాగుతుండటంతో తండ్రి జయకృష్ణ, సోదరుడు నాగబాబు మందలించారు. దీంతో మద్యం తాగటం మానేస్తానని సురేష్ కొద్ది రోజుల క్రితం కొండాలమ్మ గుడి వద్దకు వెళ్లి కడియం వేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే కడియం తీసివేసి మరల మద్యం తాగటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో గురువారం మద్యం తాగి సోదరుడు నాగబాబు ఉంటున్న లక్ష్మీపురం కాలనీ ఇంటికి వచ్చాడు. తండ్రి, సోదరుడు మందలించడంతో మనస్తాపానికి గురైన సురేష్ తాడిగడప కార్మికనగర్‌లో ఉన్న తన ఇంటికి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏపీఈసెట్‌లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు

ఏపీఈసెట్‌లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు