
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
తిరువూరు: విధినిర్వహణలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అనుసరించవద్దని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. తిరువూరు ఆర్యవైశ్య కల్యాణ మండ పంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరువూరు డివిజన్ నుంచే ప్రతి సోమవారం జరిగే పీజీఆర్‌ఎస్‌లో అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ అర్జీల పరిష్కారంలో సంతృప్తిస్థాయిని పెంచాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. నాణ్యతతో సమస్య పరిష్కరించినపుడే కార్యక్రమానికి సార్థకత వస్తుందన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీలు గడువులోపు పరిష్కరించడం ఎంతో ముఖ్య మన్నారు. బాధితులను అధికారులు తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రపర్యటన చేయాలని సూచించారు. మండలస్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్‌హౌస్ ఆఫీసర్ తదితర అధికారులు అర్జీల పరిష్కారంలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలన్నారు. కిందస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే పైస్థాయికి పంపవచ్చన్నారు.
283 అర్జీల స్వీకరణ
తిరువూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 283 అర్జీలు వచ్చాయి. వీటిలో తిరువూరు మండలానికి చెందినవి అత్యధికంగా 146 అర్జీలు ఉన్నాయి. రెడ్డిగూడెం నుంచి ఏడు, ఎ.కొండూరు నుంచి 38, విస్సన్నపేట నుంచి 47, గంపలగూడెం నుంచి 45 అర్జీలు వచ్చినట్లు ఆర్డీఓ మాధురి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో 100 అర్జీల స్వీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన 100 అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 37 అర్జీలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసు శాఖకు సంబంధించి 16, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏడు, పురపాలక, సర్వే శాఖలకు సంబంధించి ఆరు చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. మిగిలిన అర్జీలు గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, ఫైబర్ నెట్, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభి వృద్ధి, మహిళా శిశు సంక్షేమం, వయోజన విద్య, విద్యుత్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, డీఆర్‌డీఏ, విద్య, ఉపాధి, ఎండోమెంట్స్, మత్స్య, ఇరిగేషన్, లీడ్ బ్యాంక్ మేనేజర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, రహదారులు–భవనాలు, రిజిస్ట్రేషన్స్–స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, సైనిక సంక్షేమం విభాగాలకు సంబంధించిన అర్జీలని పేర్కొన్నారు.