
ఊరి దేవుళ్లు!
నిజామాబాద్
కష్టాలు తొలగించే
సత్తాచాటిన డొంకేశ్వర్..
బాసర ట్రిపుల్ ఐటీ ఎంపికల్లో డొంకేశ్వర్ మండల విద్యార్థులు సత్తా చాటారు. 42 మంది ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆరుద్రతో ఆషాఢమాసం మొదలైంది. ఈ మాసంలో గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే గ్రామానికి, ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా సుఖశాంతులు లభిస్తాయని పల్లె ప్రజల నమ్మకం. తరతరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వర్షాల కోసం గంగనీళ్లకు వెళ్లడం.. తెచ్చిన ఆ నీటితో ఊరి దేవుళ్లను శుద్ధి చేయడం అనాదిగా వస్తోంది. పస్కరాజులతో మొదలుపెట్టి తొలి ఏకాదశి వనభోజనాలు పూర్తయ్యే వరకు వారానికో క్రతువును నిర్వహించే బాధ్యతలను ప్రతి ఊరిలో ఆ ఊరి పెద్ద మనుషులే చూడడం ఆనవాయితీ. ప్రజలు జూలై నెలాఖరు వరకు గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఘనంగా పూజలు చేస్తారు. కొబ్బరికాయలు కొట్టి కోళ్లు, మేకలు కోసి మొక్కులు తీర్చుకుంటారు. రైతు లు ఊరి దేవతలను మొక్కిన తర్వాతనే పంటలేస్తారు.
వల గొడుగుతో డప్పుచప్పుల్ల మధ్య గంగనీళ్లకు వెళ్తున్న గ్రామస్తులు
న్యూస్‌రీల్
ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాల నివేదన
నియమనిష్టలతో గంగనీళ్లతో విగ్రహాల శుద్ధి
నాలుగు వారాల పాటు కొనసాగనున్న కార్యక్రమాలు
పల్లెల్లో మొదలైన పండుగ వాతావరణం

ఊరి దేవుళ్లు!

ఊరి దేవుళ్లు!