
ధాన్యం సేకరణలో మనమే ఫస్ట్
మోపాల్(నిజామాబాద్‌రూరల్): జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసింది. ఒకవైపు నాట్లు వేస్తుండగా, మరోవైపు కొనుగోలు కేంద్రాలు కొనసాగాయి. ఈ సీజన్‌లో లక్ష్యానికి మించి 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా మొదటిస్థానంలో నిలిచింది.
రూ.1949 కోట్ల విలువైన ధాన్యం
జిల్లావ్యాప్తంగా 606 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,15,996 మంది రైతుల నుంచి 8,40,144 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రూ.1949.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందులో 7,38,662 మెట్రిక్ టన్నులు సన్నరకం కాగా, 1,01, 481 మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు ఉన్నాయి. రూ.1948 కోట్ల ధాన్యం డబ్బులను 1,15,945 రై తుల ఖాతాల్లో జమచేశారు. గత వానాకాలం సీజన్‌లో 4,19,597 మెట్రిక్ టన్నులు కాగా, గతేడాది యాసంగి సీజన్‌లో 4,28,214 మెట్రిక్ టన్నులు సేకరించారు. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధికంగా ధా న్యం కొనుగోలు చేసి మొదటిస్థానంలో నిలిచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తర్వాతి స్థానాల్లో న ల్గొండ, సూర్యాపేట్, కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
బోనస్ ప్రభావంతోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నరకాలను ప్రోత్సహించేందుకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. వానాకాలంలో సన్నవడ్లు పండించి న రైతులకు బోనస్ డబ్బులు జమచేశారు. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని ప్రకటించడంతో సన్నరకాల సాగు పెరగడమే కాకుండా, బయట వ్యాపారులకు విక్రయించలేదు.
అధికారుల ఉరుకులు.. పరుగులు
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకూ అధికార యంత్రాంగం ఉరుకులు.. పరుగులు పెట్టింది. మొదట్లో ధాన్యం సేకరణ సాఫీగా సాగినా.. మిల్లర్లకు సామర్థ్యానికి మంచి కేటాయింపులు, నిండుకున్న గోదాములు, మరోవైపు వర్షం, తరుగు, ధాన్యం రవాణా సమస్యలతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రధానంగా తడిసిన ధాన్యం సేకరణతో తలలు పట్టుకున్నారు. రెండు నెలలకుపైగా కొనుగోళ్లు చేపట్టడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మరోవైపు తరు గు పేరుతో మిల్లర్లు విపరీతంగా దోచుకున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో 8.40 లక్షల
మెట్రిక్ టన్నుల కొనుగోలు
బోనస్ ప్రకటనతో దండిగా వడ్లు
2 నెలలకుపైగా సాగిన కొనుగోళ్లు
సాఫీగా ముగిసిన కొనుగోళ్లు
జిల్లాలో రికార్డుస్థాయిలో ధా న్యం కొనుగోలు చేశాం. సేక రణ ప్రక్రియ సాఫీగానే ము గించాం. 8,40,144 మెట్రిక్ టన్నులు సేకరించడమంటే ఆషామాఫీ కాదు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పూర్తిచేశాం.
– శ్రీకాంత్‌రెడ్డి, మేనేజర్, పౌరసరఫరాల సంస్థ

ధాన్యం సేకరణలో మనమే ఫస్ట్