
ప్రభుత్వ కళాశాలలకు రూ.3.23 కోట్లు
జూనియర్ కళాశాల మంజూరైన నిధులు (రూ)
నిజామాబాద్(బాలికలు) 30,00,000
నిజామాబాద్(బాలుర) 56,00,000
డిచ్‌పల్లి 14,00,000
మాక్లూర్ 10,00,000
మోర్తాడ్ 26,35,000
వర్ని 20,50,000
బోధన్ మధుమలాంచ 10,70,000
ఆర్మూర్ (బాలికలు) 16,00,000
ఆర్మూర్ (బాలుర) 24,00,000
భీమ్‌గల్ 18,00,000
ఐలాపూర్ 9,00,000
బాల్కొండ 33,05,000
ధర్పల్లి 25,00,000
కోటగిరి 30,50,000
● మరమ్మతులు, కనీస వసతుల
కల్పనకు మంజూరు
● ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ కళాశాలల మరమ్మతులు, కనీస వసతుల కల్పనకు రూ. 3.23 కోట్లు మంజూరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఈ నిధులను రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య మంజూరు చేశారన్నారు. ఇంటర్ విద్య బలోపేతం కోసం కళాశాలలో విద్యార్థులకు తాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్వహణ, కళాశాలలకు సున్నం వేయడం, కరెంటు రిపేర్లు, ఫర్నిచర్ తదితర వాటికి ఈ నిధులను వెచ్చించనున్నారు.