● సీసీ ఫుటేజ్‌లో ఐదుగురు వ్యక్తులు
ఖానాపూర్: పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ లో పెట్రోల్ చోరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాలనీలోని ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లో ఐదుగురు వ్యక్తులు వాహనాల నుంచి పెట్రోల్ తీస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వారు ముఠాగా పనిచేస్తున్నట్లు అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలనీలో ఇలాంటి ఘటనలు పెరుగుతుండటంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళల్లో వాహనాలు భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు. కాలనీల్లో పోలీసు ల గస్తీ పెంచాలని కోరుతున్నారు.


