ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి

లక్నో: వైద్యుల నిర్లక్ష‍్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్‌ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష‍్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్‌ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది.
Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation
On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023
మరిన్ని వార్తలు :