ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను గ్లో» ల్ సమ్మిట్‌కు రావాలంటూ ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్, భట్టి. కావ్య, చామల, సురేశ్ షెట్కార్, అనిల్, మల్లు రవి, రఘువీర్‌రెడ్డి
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్.. మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు హాజరు కావాలని ఆహా్వనించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపైనా ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది.
ఈ సమ్మిట్ రాష్ట్రం తన అభివృద్ధి దృక్పథం, ప్రధాన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక తెలంగాణ రైజింగ్–2047 రోడ్ మ్యాప్‌ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం పార్లమెంటులో పీఎం నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని కూడా సీఎం కలవనున్నారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తారు.


