దళపతి విజయ్‌కు రజనీ, కమల్ అభినందనలు | Rajinikanth, Kamal Haasan congratulated TVK Vijay | Sakshi
Sakshi News home page

దళపతి విజయ్‌కు రజనీ, కమల్ అభినందనలు

May 4 2026 10:31 PM | Updated on May 5 2026 11:26 AM

Rajinikanth, Kamal Haasan congratulated TVK Vijay

సాక్షి,చెన్నై: విజయ్‌ను అభినందిస్తూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్,నటుడు కమల్ హాసన్ ట్వీట్ చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్‌కి,ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు అంటూ రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

తమ మొట్టమొదటి ఎన్నికలోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ కి, వారి పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజా సేవ వర్ధిల్లాలని నా శుభాకాంక్షలంటూ కమల్ హాసన్ ట్వీట్‌ చేశారు.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలనం సృష్టించారు. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించి, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించారు. కేవలం రెండేళ్ల క్రితం ఏర్పడిన టీవీకే 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాల్లో గెలుపొందింది. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆ పార్టీకి 118 సీట్లు అవసరం. 
ఎన్ని అవమానాలు వచ్చినా.. రజిని.. కమల్ కానిది విజయ్ సాధించాడు


విజయ్‌ అధికార పగ్గాలు చేపట్టేందుకు మరో పదికిపైగా స్థానాలు అవసరం అవుతున్న నేపథ్యంలో డీఎంకేతో సీట్ల పంచాయతీ వివాదాలను ఎదుర్కొన్న ఆ కూటమిలోని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే సైతం మద్దతుగా నిలిచే అవకాశాలు ఉండడంతో తమిళనాట ఈసారి సంకీర్ణ ప్రభుత్వం తథ్యంగా కనిపిస్తోంది. విజయ్‌ సైతం తన తొలి మహానాడులో సంకీర్ణ ప్రభుత్వానికి రెడీ అని స్పష్టంగా ప్రకటన చేయడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement