మణిపూర్‌ పోలింగ్ హింసలో.. ఇద్దరి మృతి | Manipur Elections 2022: Two killed In Separate Incidents | Sakshi
Sakshi News home page

Manipur Election 2022 Phase 2: మణిపూర్‌ పోలింగ్ హింసలో.. ఇద్దరి మృతి

Mar 5 2022 1:04 PM | Updated on Mar 5 2022 1:04 PM

Manipur Elections 2022: Two killed In Separate Incidents - Sakshi

ప్రశాంతతకు దూరంగా మణిపూర్‌ ఎన్నికలు సాగుతున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు..

మణిపూర్‌ రెండో ఫేజ్‌ ఎన్నికల పోలింగ్‌ కూడా హింసాత్మక ఘటనల మధ్యే సాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.  అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. 

థౌబాల్‌ జిల్లా, సేనాపతి జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసలో వేర్వేరే ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరికొన్ని చోట్ల కూడా అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇక ఉదయం 11 గంటల వరకు 28 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 

పది జిల్లాలు.. 22 నియోజకవర్గాలు 92 మంది అభ్యర్థులు మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో ఫేజ్‌(చివరిది కూడా) పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement