
సాక్షి బెంగళూరు: రాష్ట్రంపై పంజా విసిరిన కరోనా మహమ్మారి నెమ్మదిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టగా డిశ్చార్జ్‌ల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో 2,984 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 28,49,997కి పెరిగింది. 14,337 మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్నవారి సంఖ్య 27,60,881కి చేరింది. 88 మంది మృతి చెందగా మరణాల సంఖ్య 35,222కి చేరింది.
53,871 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివిటీ రేటు 1.92 శాతం, మరణాల రేటు 2.94 శాతంగా నమోదైంది. బెంగళూరులో కరోనా ఉధృతి మరింత తగ్గింది. 593 కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 12,14,828కి చేరాయి. 11,75,748 మంది డిశ్చార్జికాగా 23,424 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 11 మంది మృత్యువాత పడ్డారు.