Fact check: వ్యాక్సిన్‌తో అయస్కాంత శక్తి ... అసలు నిజం ఇది | Does COVID-19 vaccine make you magnetic? The Reasons Behind The Magnetism Videos | Sakshi
Sakshi News home page

Fact check: వ్యాక్సిన్‌తో అయస్కాంత శక్తి ... అసలు నిజం ఇది

Jun 16 2021 9:11 PM | Updated on Jun 16 2021 9:15 PM

Does COVID-19 vaccine make you magnetic? The Reasons Behind The Magnetism Videos - Sakshi

మంగళూరు: కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకుంటే శరీరానికి అయస్కాంత లక్షణాలు వస్తున్నాయనే వార్తలు దేశమంతట నుంచి వినిపిస్తున్నాయి. దక్షిణ భారతం మొదలు ఈశాన్య భారతం వరకు చాలా మంది ఒంటికి కరెన్సీ బిళ్లలు, చెమ్చాలు, ప్లేట్లు అంటించుకుని సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా వీడియోలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌పై మరోసారి అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. 

పీఐబీ  ఖండన
వ్యాక్సిన్‌ వేసుకుంటే ఆయస్కాంత శక్తి వస్తోందంటూ వైరల్‌ అవుతోన్న వీడియోలపై ప్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ స్పందించింది. కోవిడ్‌ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌తో పోరాడే ఔషధాలే తప్ప శరీరానికి అయస్కాంత లక్షణాలు ఇచ్చే మరేవీ లేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు రావాలని కోరింది.

కర్నాటకలో కలకలం
తాజాగా కర్నాటకలో ఉడుపి, బెంగళూరులలో ఇద్దరు మహిళలు ఇలాంటి పోస్టులు పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. వ్యాక్సిన్‌తో శరీరం అయస్కాంతంలా మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టారు మంగళూరుకు చెందిన రేషనలిస్టు నరేంద్ర నాయక్‌. లోహపు వస్తువులు శరీరానికి అంటుకోవడానికి గల కారణాలను సైంటిఫిక్‌గా వివరించారు.

కారణం ఇది
కోవిడ్‌ వ్యాక్సిన్‌ అనంతరం అయస్కాంత శక్తి గురించి నరేంద్ర నాయక్‌ వివరిస్తూ ‘‘తలతన్యత (surface Tension) కారణంగానే శరీరానికి లోహపు వస్తువులు అంటుకుంటాయి, శరీర తత్వాలను బట్టి కొందరిలో ఈ తలతన్యత గుణం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎవరైనా శరీరానికి లోహపు వస్తువులు అతుక్కుంటున్నాయని చెబితే...  ఓసారి సబ్బుతో లేదా ఆల్కహాల్‌ శానిటైజర్‌తో ఎక్కడైతే లోహపు వస్తువులు ఆకర్షింపబడుతున్నాయని చెబుతున్నారో.... ఆ శరీర భాగాలను శుభ్రం చేయండి. ఆ తర్వాత ఆ శరీర భాగాన్ని టవల్‌తో తుడిచి పొడిగా మారేలా చూడాలి. అనంతరం ఆ శరీర భాగంపై లోహాపు వస్తువులు అంటివ్వమని కోరాలి...... ఇప్పుడు ఆ వస్తువులు వారి ఒంటికి అంటుకోవు. ఎందుకంటే సబ్బు, ఆల్కహాల్‌ శాటిటైజర్‌ కారణంగా తలతన్యత తగ్గిపోతుంది’ వివరించారు.

నిజం కాదు
లోహపు వస్తువులు శరీరారానికి అంటుకోవడానికి తలతన్యత తప్ప మరో కారణం లేదని ఆయన చెప్పారు. వ్యాక్సిన్‌ మాగ్నటిజం గురించి చెబతున్న వాళ్ల ఒంటికి రాగి వస్తువులు కూడా ఒంటికి అంటుకుంటున్నాయని. ఇది అయస్కాంత ధర్మాలకు విరుద్ధమని కూడా ఆయన తెలిపారు. 

చదవండి : Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement