శతమానం భారతి: భారత రక్షణ వ్యవస్థకు వెన్నుదన్నుగా డి.ఆర్‌.డి.ఓ

Azadi ka Amrit Mahotsav Indian Defence System - Sakshi

భారత సాయుధ దళాల కోసం అత్యాధునిక రక్షణ సాంకేతికతలను, యుద్ధంలో గెలిపించే ఆయుధ వ్యవస్థలను రూపొందించేందుకు స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరమే 1948 లో డాక్టర్‌ డి.ఎస్‌.కొఠారి ప్రారంభించిన రక్షణ సర్వీసు వ్యవస్థ (డి.ఎస్‌.ఓ.) భారత రక్షణ రంగానికి వెన్ను దన్నుగా నిలిచింది. 1958 జనవరి 1న డి.ఆర్‌.డి.ఓ.గా పేరు మార్చుకున్న డి.ఎస్‌.ఓ. సాయుధ దళాలకు కావలసిన ఆయుధాలు, ఇతర సామగ్రిని తయారు చేసి అందించే స్థాయికి చేరుకుంది.

ప్రారంభంలో ఈ సంస్థ నుంచి రక్షణ రంగానికి సలహాలు మాత్రమే లభించేవి. 1970–80 లలో డి.ఆర్‌.డి.ఓ. శాంతియుత ప్రయోజనాలకోసం అణుపరీక్షలు నిర్వహించింది. దూరాన్ని కచ్చితంగా కొలిచే సాధనాలను; రాకెట్లకు ఘన, ద్రవ ఇంధనాలను కనిపెట్టింది. మోర్టార్లు, క్షిపణులు, ఫిరంగులు, నిఘా రాడార్లు తయారు చేసింది.1980–90 మధ్య సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ తయారీకి డి.ఆర్‌.డి.ఓ. ఆధ్వర్యంలో సన్నాహాలు మొదలయ్యాయి.

సఫలం అయ్యాయి. డి.ఆర్‌.డి.ఓ. ప్రస్తుత చైర్మన్‌ డాక్టర్‌ జి. సతీశ్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో దేశం ఆయుధాల ఎగుమతి సామర్థ్యం పెంచుకునే దిశగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతసాధన వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. డి.ఆర్‌.డి.ఓ. కు దేశవ్యాప్తంగా 50 కి పైగా çపరిశోధనాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థలో సుమారు 5000 మంది సైంటిస్టులు, 25 వేల మంది సహాయక సిబ్బంది పని చేస్తున్నారు.

(చదవండి:  భారత్‌-చైనా యుద్ధం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top