కరోనా ఎఫెక్ట్‌.. అక్కడ మళ్లీ మొదలైన లాక్‌డౌన్‌

Aurangabad District Administration On Saturday Decided To Impose Full Lockdown - Sakshi

ఔరంగబాద్‌: కరోనా కేసుల సంఖ్య ఆకస్మికంగా  పెరగడంతో మహరాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించింది. కేసుల  పెరుగుదల ప్రభుత్వానికి  ఇబ్బందిగా మారింది. గత ఏడాది మాదిరిగా పలు జిల్లాల్లో కఠినమైన లాక్‌డౌన్‌ చర్యలను తిరిగి విధించవలసి వచ్చింది. దీంతో జిల్లాలోని ప్రాంతాల్లో నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వారాంతాల్లో కూడా పూర్తి లాక్‌డౌన్ ను విధించాలని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లాలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 57,755 నమోదవ్వగా, నిన్నటి వరకు 5,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. 

మార్చి 15-21 వరకు నాగ్‌పూర్‌లో కూడా పూర్తి లాక్‌డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 4 వరకు వారాంతపు రోజులలో కూడా జిల్లాలో పాక్షిక లాక్డౌన్ అమలుచేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అత్యవసర సేవలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్‌లు వంటి అవసరమైన సేవలు మాత్రమే తెరిచి ఉంటాయి. రాష్ట్రంలో శుక్రవారం వరుసగా మూడో రోజు ఈ ఏడాదిలో అత్యధికంగా 15,817 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 22,82,191 కు పెరిగింది, అయితే మరణాల సంఖ్య  56గా నమోదవడంతో ,మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,723కు చేరింది.

ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు  వికె పాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల పట్ల చాలా ఆందోళనగా ఉందన్నారు. ఇది తీవ్రమైన పరిణామంగా భావించాలని, కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. (చదవండి: అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top