గంజాయి పట్టివేత
నందికొట్కూరు: పలువురి నుంచి 2.25 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం ఆదివారం తెలిపారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి వినియోగదారుల అరెస్ట్ చూపించారు. సీఐ మాట్లాడుతూ..ఆత్మకూరు పట్టణానికి చెందిన చాకలి వంశీ సూచనల మేరకు నందికొట్కూరు మండలం 10 బొల్లవరం గ్రామానికి చెందిన వాకటి శ్యామ్ ప్రసాద్ గత నెల 26న రాత్రి ఒడిశా రాష్ట్రానికి రైలులో వెళ్లారు. బరంపూర్‌కు చెందిన నీలాంచల్ పట్నాయక్‌కు రూ.16 వేలు చాకలి వంశీ పంపించాడు. అతను ఇచ్చిన గంజాయితో 10 బొల్ల వరం చేరుకున్నాడు. నందికొట్కూరుకు చెందిన దూదేకుల మహమ్మద్ రఫితో కలిసి దామగట్ల గ్రామ సమీపంలోని వెంచర్‌లో గంజాయి సేవించేందుకు సిద్ధమ వుతుండగా స్థానికుల సమాచారం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సమావేశంలో బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ తిరుపాలు పాల్గొన్నారు.


