శిథిల ‘బడి’
ఈ దృశ్యాలు గడివేముల ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంపీపీ స్కూల్‌లో కనిపించాయి. ఈ పాఠశాలలో చదివి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. అయితే పాఠశాల తరగతి గదులు పూర్తిగా దెబ్బతిన్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొన్ని గదులు పాడుబడి శిఽథిలావస్థకు చేరాయి. దీంతో వాటిని వినియోగించడం లేదు. అందులో ముళ్లపొదలు పెరిగి విషపురుగులు తిరుగుతున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శిథిలమైన తరగతి గదులు తొలగించి విద్యార్థులను సురక్షితంగా ఉంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – గడివేముల
శిథిల ‘బడి’


