డీఆర్‌డీఎల్ ల్యాబ్ డైరెక్టర్‌గా రాజాపేట వాసి
రాజాపేట : రాజాపేట మండల కేంద్రానికి చెందిన డీఆర్‌డీఎల్ శాస్త్రవేత్త అంకతి రాజు డీఆర్‌డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్‌గా శుక్రవారం నియామకమయ్యారు. ఆయన బెంగుళూరులో 1991 నుంచి 2002 వరకు 11 సంవత్సరాలపాటు డీఆర్‌డీఎల్‌లోని గ్యాస్ టర్బైన్ రీసర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (జీటీఆర్‌ఈ)లో శాస్త్రవేత్తగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2022 వరకు డీఆర్‌డీఎల్ హైదరాబాద్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లో లిక్విడ్ ప్రొఫెషన్ డివిజన్‌లో దీర్ఘశ్రేణి హేర్ టూ హేర్ మిసైల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2022లో ఈఆర్‌డీఈ (అర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్) డైరెక్టర్‌గా పూణెకు వెళ్లారు. ప్రస్తుతం డీఆర్‌డీడీఓకు విశిష్ట శాస్త్రవేత్తగా ఉంటూ డీఆర్‌డీఎల్ హైదరాబాద్ ల్యాబ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మోటకొండూర్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మోటకొండూర్ మండలంలోని నాంచారిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండీ ఖరీమ్(46) ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు. ఇంటి పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. అతను తన కుటుంబంతో వేరే ఇంట్లో ఉంటున్నాడు. పనులు జరుగుతున్న ఇంటిలో కరెంట్ బల్బ్ వేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అంబులెన్స్‌లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ముత్తిరెడ్డిగూడెంలో ప్రైవేటు స్కూల్‌లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉంది.
స్వర్ణగిరిలో సహస్ర
కుంకుమార్చన
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి ఆలయ అర్చకులు సహస్ర కుంకుమార్చన సేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, సత్యనారాయణ వ్రతం, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఎల్ ల్యాబ్ డైరెక్టర్‌గా రాజాపేట వాసి


