పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులు, భూ భారతి, భూ వివాదాల దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి మండలంలో పెండింగ్ ఫిర్యాదులను వారానికి ఒకసారి సమీక్షించాలని తెలిపారు. భూ సంబంధ వ్యవహారాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల, అసైన్డ్ భూముల ఫిర్యాదులను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థలు ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


