జిల్లాలోని మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డుల వద్ద కంపోస్టు ఎరువుల తయారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ. 50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను వెచ్చించారు. కానీ ఎక్కడా ఎరువులు, కంపోస్టు తయారీ చేపట్టడం లేదు. తడిచెత్తను సేకరించి ఎరువుగా మార్చితే మున్సిపాలిటీలకు ఆదాయ వనరులుగా మారే అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులను హరితహారం కింద నాటిన మొక్కలకు వినియోగించేందుకు అవకాశం ఉండగా ఎక్కడా అమలుకావడం లేదు.
చెత్తయార్డుగా మార్చారు
కొల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన చెత్తను రోజూ తీసుకొచ్చి మా గ్రామ శివారులో ప్రధాన రోడ్డు పక్కనే వేస్తున్నారు. స్థానికులతో పా టు పర్యాటక ప్రాంతమైన అమరగిరికి వస్తున్న పర్యాటకులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదు.
– భరత్‌కుమార్,
అమరగిరి, కొల్లాపూర్ మండలం