
దండిగా నిధులు.. ఊరంతా పనులు
సీఎం స్వగ్రామంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల కోసం చేపట్టిన నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ భవనం పూర్తికాగా.. ప్రధాన రహదారులు, అంతర్గత, సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. కొండారెడ్డిపల్లి నుంచి పోల్కంపల్లి వద్దనున్న హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి వరకు రోడ్డును సైతం నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.33 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా పాలశీతలీకరణ కేంద్రం, వెటర్నరీ ఆస్పత్రి, గ్రామ పంచాయతీ, రైతు వేదిక ఆధునీకరణ, లైబ్రరీ, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, గ్రామం నుంచి మండల కేంద్రానికి, ఇతర గ్రామాలకు అనుసంధానంగా నాలుగు వరుసల రహదారులు, ఇంటింటా మిషన్ భగీరథ నీటి సౌకర్యం, సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు