
విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దు
మన్ననూర్: పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శుక్రవారం ఆయన మన్ననూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు, పీటీజీ పాఠశాల/కళాశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు రూపాదేవి, పద్మావతి, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి అక్కడి పరిసరాలను కలియదిరిగారు. విద్యా బోధన, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు అందరికీ అందించారా.. అని ఆరాతీశారు. వసతి గృహం, పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు రాత్రి సమయంలో పడుకునేందుకు మంచాలు, కొన్ని అదనపు టాయిలెట్స్ నిర్మాణాలు అవసరమని ప్రిన్సిపాల్ రూపాదేవి అదనపు కలెక్టర్ దృష్టికి తేగా స్పందించిన ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమకూర్చేందుకు కృషిచేస్తానన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సరిత, డీఎల్‌పీఓ వెంకటప్రసాద్, మండల వ్యవసాయాధికారికారి మహేష్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు.