అభివృద్ధి జోరు.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి జోరు..

Jul 5 2025 5:58 AM | Updated on Jul 5 2025 5:58 AM

అభివృ

అభివృద్ధి జోరు..

సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామంలో పనులు వేగవంతం

గ్రామానికి అన్ని హంగులు..

మా గ్రామానికి చెందిన ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కావడం మాకెంతో గర్వకారణం. ఇప్పటికే గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెటర్నరీ ఆస్పత్రి, పాలశీతలీకరణ కేంద్రం, బస్టాండ్‌, పంచాయతీ భవనాలతోపాటు రోడ్లతో గ్రామం రూపురేఖలు మారుతున్నాయి.

– వేమారెడ్డి,

కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ..

కొండారెడ్డిపల్లిలో అన్ని అభివృద్ధి పనులను సమాంతరంగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే కొన్ని భవన నిర్మాణాలు, సీసీరోడ్లు, సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాం. దసరా నాటికి పనులను పూర్తి చేసేలా వేగం పెంచాం.

– దేవసహాయం,

ఇన్‌చార్జ్‌ అధికారి, అదనపు కలెక్టర్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ వంగూరు: సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో విస్తృతంగా చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని రోజులుగా వేగం పుంజుకున్నాయి. జిల్లాలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో తొలి విడతలో ఇప్పటికే సుమారు రూ.150 కోట్ల నిధులతో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేపట్టగా.. మరోవిడత అభివృద్ధి పనుల ప్రతిపాదనలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎక్కడ చూసినా అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణ, సుందరీకరణ ఇతరత్రా అభివృద్ధి పనుల హడావుడే కనిపిస్తోంది. ఆయా పనుల పర్యవేక్షణకు ఇన్‌చార్జ్‌గా జిల్లా అదనపు కలెక్టర్‌ దేవసహాయంను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే దసరా పండుగకు సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈలోపే ప్రధాన పనులను పూర్తిచేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే..

కొండారెడ్డిపల్లిలో ఇంటింటికీ సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలోని మొత్తం 515 ఇళ్లకు గానూ ఇప్పటి వరకు 405 ఇళ్లలో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేశారు. ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసి, తమ అవసరాలకు వినియోగించుకోవడమే కాక మిగులు విద్యుత్‌ను ఎస్‌పీడీసీఎల్‌కు విక్రయించుకునేలా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కేబుల్‌ వైర్లను స్తంభాలకు కాకుండా అండర్‌ గ్రౌండ్‌ కేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే ప్రభుత్వం అండర్‌ గ్రౌండ్‌ కేబుళ్లను గ్రామంలో ఏర్పాటు చేస్తుంది.

మారనున్న ముఖచిత్రం..

కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. పెద్దఎత్తున నిధులు వెచ్చించి విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గ్రామంలోని అన్ని కాలనీలకు అంతర్గత సీసీరోడ్లు, ఎల్‌ఈడీ సెంట్రల్‌ లైటింగ్‌, విశాలమైన రహదారులు, అధునాతన ప్రభుత్వ భవనాలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలు, ఇంటింటా సోలార్‌ వెలుగులు, గ్రామం చుట్టూ సుందరీకరణ పనులతో మెరిసిపోయేలా అధికారులు తీర్చిదిద్దుతున్నారు.

కొండారెడ్డిపల్లిలో ప్రధానంగా చేపట్టిన

పనుల వివరాలు

పనులు నిధులు

(రూ.కోట్లలో)

రహదారుల విస్తరణ 21

మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ 31.1

అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ,

ఎస్‌టీపీ 9.30

అంతర్గత సీసీ రోడ్లు 8.70

విద్యుత్‌ ఫీడర్ల ఏర్పాట్లు 2.85

పాలశీతలీకరణ కేంద్రం 2.50

గ్రామ పంచాయతీ భవనం 0.72

బీసీ కమ్యూనిటీ హాల్‌ 0.58

గ్రంథాలయం 0.55

వెటర్నరీ ఆస్పత్రి భవనం 0.45

ఎల్‌ఈడీ లైట్లు 0.40

చుట్టూరా సుందరీకరణతో

మెరిసిపోయేలా కొండారెడ్డిపల్లి

మొదటి విడతలో సుమారు

రూ.150 కోట్లు కేటాయింపు

అధునాతన భవనాలు, రోడ్ల విస్తరణతో మారుతున్న రూపురేఖలు

ఈ దసరాలోగా పూర్తి చేసేందుకు

అధికారుల కసరత్తు

అభివృద్ధి జోరు.. 1
1/2

అభివృద్ధి జోరు..

అభివృద్ధి జోరు.. 2
2/2

అభివృద్ధి జోరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement