నేడు సర్టిఫికెట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేడు సర్టిఫికెట్ల పరిశీలన

Jul 4 2025 3:38 AM | Updated on Jul 4 2025 3:38 AM

నేడు సర్టిఫికెట్ల పరిశీలన

నేడు సర్టిఫికెట్ల పరిశీలన

కందనూలు: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, పీఈటీ బోధన పోస్టులకు 2023లో రాత పరీక్ష ద్వారా మెరిట్‌ రోస్టర్‌ ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు 1:3 నిష్పత్తి ప్రకారం శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియేట్‌, డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ (పీజీ), బీఈడీ, ఎంఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, డిప్లొమా సర్టిఫికెట్లతోపాటు స్థానికం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. దివ్యాంగులైతే అందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలని, గతంలో పనిచేసిన అనుభవం ఉంటే ఎక్స్‌పీరియన్స్‌, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు తేవాలని సూచించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు డీఈఓ కార్యాలయంలో వెరిఫికేషన ఉంటుందని, రోస్టర్‌, మెరిట్‌ లిస్టులో ఉన్న అభ్యర్థుల వివరాలను డీఈఓ జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు.

ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం

కందనూలు: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో 2025 సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మదన్‌మోహన్‌, విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్ర సమన్వయకర్త అంజయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ ఇంటర్‌, ఐటీఐ లేదా ఇతర డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వచ్చే నెల 13లోగా ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశం పొందాలని సూచించారు. అడ్మిషన్‌ కోసం విద్యార్థులు 10వ తరగతి మెమో, ఇంటర్‌ మెమో లేదా ఇతర అర్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌, కుల ధ్రువపత్రం, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం సెల్‌ నం.73829 29779 లేదా నెల్లికొండ ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. అలాగే 2, 3 సంవత్సరం విద్యార్థులు అడ్మిషన్‌ ఫీజు చెల్లించాలన్నారు.

ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలి

కందనూలు: జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్‌ రామలక్ష్మి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఉద్యాన శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించి, రైతువేదికల వారిగా అవగాహ న సదస్సులు నిర్వహించాలని, తద్వారా లక్ష్యా న్ని సాధించాలని ఆదేశించారు. ఆయిల్‌పాం సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదా యం వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, ప్రీయూనిక్‌ ఆయిల్‌పాం, డ్రిప్‌ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement