
హెచ్‌ఐవీ బాధితులకు అండగా ఉందాం
ములుగు: హెచ్‌ఐవీ బాధితులకు అండగా ఉండాలని రాయిని గూడెం పీహెచ్‌సీ వైద్యుడు నాగ అన్వేష్ అన్నారు. ఆదివారం తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ములుగు సహకారంతో దిశ ములుగు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేను జిల్లా ఆస్పత్రిలో నిర్వహించారు. హెచ్‌ఐవీతో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. వైద్యులు నాగ అన్వేష్, ప్రేమ్ సింగ్, ప్రదీప్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం మే మూడో ఆదివారం క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏరియా ఆస్పత్రి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. హెచ్‌ఐవీతో మృతి చెందిన వారి ఆత్మ శాంతికి మౌనం పాటించారు. కార్య క్రమంలో దిశ సీపీఎం జ్యోతి, ఐసీడీపీ కౌన్సిలర్లు కుమార్ సింగ్, వెంకటేశ్వర్లు, ములుగు, బండారు పల్లి, జంగాలపల్లి, జాకారం, ఏఎన్‌ఎమ్‌లు, ఆశ కార్య కర్తలు, లింక్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
తునికాకు కూలీకి
పాముకాటు
వాజేడు: తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన కూలీ పాము కాటుకు గురైంది. స్థానికులు, ఆమె భర్త లోహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ గ్రామానికి చెందిన పూనెం శ్రీలత తునికాకు సేకరణ కోసం సమీపంలోని ములుకనపల్లి గ్రామం అవతల ఉన్న అడవిలోకి వెళ్లింది. తునికాకు సేకరిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వాజేడు వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స నిర్వహించి ఏటూరునాగారం అక్కడి నుంచి ములుగు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు లోహమూర్తి తెలిపాడు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
కాటారం: కాళేశ్వర ముక్తీశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న ఆదివారం కుటుంబ సమేతంగా సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మహేశ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంకు ఎనలేని చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా సరస్వతి పుష్కరాలను నిర్వహిస్తుందన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మల్లన్న తెలిపారు. మల్లన్న వెంట తీన్మార్ మల్లన్న టీం జిల్లా అద్యక్షుడు రవిపటేల్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ హరిశంకర్, తదితరులు ఉన్నారు.
‘చెన్నయ్య ఆరోపణలు సరికాదు’
కాళేశ్వరం: మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నారని అవగాహన రాహిత్యంతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపణలు చేయడం సరికాదని నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సెగ్గం రాజేష్ అన్నారు. ఆదివారం మహదేవపూర్ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడారు. సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కూడా అందించారని, ప్రొటోకాల్‌కు దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధం ఉండదని, అది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ) చూ సుకుంటుందని సూచించారు. మంథని నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ హయాంలో అనేక దళితుల హత్యలు జరిగినప్పుడు స్పందించని చెన్నయ్య మంత్రి శ్రీధర్‌బాబు దళితులను చిన్నచూపు చూస్తున్నాడని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో నేతకాని సంఘం మహదేవపూర్ మండల యూత్ అధ్యక్షు డు కొండగొర్ల సంతోష్, పూతల శ్యామ్ సుందర్, జాడి రాజసడవల్లి, దుర్గయ్య, నరేష్, రాజ బాపు, జనార్దన్, బానేష్, నవీన్ పాల్గొన్నారు.

హెచ్‌ఐవీ బాధితులకు అండగా ఉందాం

హెచ్‌ఐవీ బాధితులకు అండగా ఉందాం