కాజల్‌కు అన్నగా మంచు విష్ణు..

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా నటించిన వాళ్లు అన్నాచెల్లెళ్ల పాత్రలో నటించే పద్దతి పాత కాలంలో ఉండేది. ఈ తరం హీరోయిన్లు ఎవరూ హీరోలకు చెల్లెలుగా నటించడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు హీరో మంచు విష్ణు సోదరుడిగా నటిస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో ఈ బంధం కనిపించనుంది. నేడు రాఖీ పూర్ణిమ సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పనిచేస్తున్న ఈ సినిమాలో నవదీప్, నవీన్ చంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్)
జెఫరీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. చరిత్రలో నమోదైన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ మూవీకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను కాజల్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వేసవిలో ‘మోసగాళ్ళు’ విడుదల కావాల్సి ఉండగా, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విడుదల తేదీ వాయిదాపడింది. అయితే ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. (రాఖీ: చెల్లెళ్లతో చిరంజీవి.. వీడియో వైరల్)