
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్. కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ బుధవారం గోవాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌తో ఫైట్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు.
‘‘బ్లడ్.. స్వెట్... వయొలెన్స్’ (రుధిరం.. స్వేదం.. హింస) లైగర్ షూటింగ్ తిరిగి ప్రారంభం’’ అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘‘స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచా మా సినిమాకు పని చేస్తుండటం విశేషం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి.