Scam 1992 Actor: పోలీసులు ఘోరంగా అవమానించారు, కాలర్ పట్టుకుని..

Actor Pratik Gandhi Tweet Police Pushed Him By Shoulder: తనని ముంబై పోలీసులు ఘోరంగా అవమానించారంటూ ‘స్కామ్ 1992’ ఫేం, బాలీవుడ్ ప్రతీక్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ముంబై పోలీసుల తీరుపై ఆసహనం వ్యక్తం చేశాడు. నిన్న(ఆదివారం) సాయంత్రం వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే(డబ్ల్యూఈహెచ్) రోడ్డుపై నడుస్తుండగా పోలీసులు కాలర్ పట్టుకుని పక్కకు తోసేశారని ప్రతీక్ తెలిపాడు.
చదవండి: నాకెప్పటికీ ఆ స్కూల్ డేస్ అంటే అసహ్యం: షాహిద్ కపూర్
‘ముంబై డబ్ల్యూఈహెచ్ వద్ద వీఐపీ ఎవరో వస్తున్న కారణంగా తీవ్రమైన ట్రాఫిక్ సమస్య చోటు చేసుకుంది. అదే సమయంలో నేను షూటింగ్ లొకేషన్‌కి చేరుకోవడానికి రోడ్డుపై అటుగా నడుస్తున్నాను. ఈ క్రమంలో పోలీసులు నా షోల్డర్ పట్టుకుని, కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే ఏదో మార్బుల్ గోడౌన్‌లోకి నెట్టారు. నిజంగా ఇది అవమానం’ అంటూ ట్వీట్ ప్రతీక్ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మేరకు పలువురు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా ముంబైలోని కీలకమైన వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రజల రాకపోకలను నిలిపివేశారు. కాగాప్రస్తుతం ప్రతీక్ గాంధీ ‘ఫూలే’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రతీక్ ‘జ్యోతి బాఫూలే’గా, పత్రలేఖ ‘సావిత్రి ఫూలే’గా నటిస్తున్నారు. అంతేగాక విద్యాబాలన్, ఇలియానాలు ఫిమెల్ లీడ్‌రోల్‌లో ప్రతీక్ గాంధీ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.
Mumbai WEH is jammed coz of “VIP” movement, I started walking on the roads to reach the shoot location and Police caught me by shoulder and almost pushed me in some random marble warehouse to wait till without any discussion. #humiliated
— Pratik Gandhi (@pratikg80) April 24, 2022