
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రష్మిక ఫస్ట్‌లుక్ విడుదల చేసిన చిత్ర బృందం, తాజాగా ఆమెకు సంబంధించిన మరో అప్‌డేట్‌ను ప్రకటించింది. దసరా సందర్భంగా సెకండ్ సింగిల్ పేరు రష్మిక సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా పుష్ప టీం ట్వీట్ చేస్తూ.. ‘ఆమె మన భయంకరమైన పుష్పరాజ్ హృదయాన్ని దొంగిలించింది. ఇప్పడు మన ఊపిరి తీసేందుకు వస్తోంది. పుష్ప నుంచి అక్టోబర్ 13న శ్రీవల్లి రాబోతోంది’ అంటూ తమ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ చిత్రంలో రష్మిక.. శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ 17న పుష్ప ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ టీం ఇటీవల అధికారిక ప్రకటన చేసింది.
She stole our ferocious #PushpaRaj's heart and she is coming to take our breath away 😍
— Pushpa (@PushpaMovie) October 5, 2021
Second single #Srivalli from #PushpaTheRise on October 13th ❤️#PushpaTheRiseOnDec17#ThaggedheLe 🤙@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/84YaJRLfJU