
కొందరు దర్శకనిర్మాతలు కొన్ని సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. ఆర్య సినిమాలో కూడా ఓ డైరెక్టర్, ఓ నిర్మాత చిన్న సీన్‌లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను తాజాగా ఓ ఈవెంట్‌లో ప్రదర్శించారు. అది చూసిన నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) తనలో తానే నవ్వుకున్నాడు. 20 ఏళ్ల కింద షూట్ చేసిన ఆ సన్నివేశం తాలూకు జ్ఞాపకాలను షేర్ చేసుకున్నాడు.

నా భార్య తిట్టింది
బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆర్య సినిమా చివరి రోజు షూటింగ్.. ఆరోజు ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు రాలేదు. దాంతో దిల్ రాజు ఆఫీస్ క్యాషియర్ శ్రీధర్, వకీల్ సాబ్ దర్శకుడు శ్రీరామ్ వేణు, నేను.. ముగ్గురం నటించాం. సుకుమార్‌గారిదే ఆలోచన.. మీరు ముగ్గురూ వేస్ట్‌గా పడున్నారు కదా.. ముందుకు రండి అని మాపై సన్నివేశం చిత్రీకరించారు. ఆ సీన్ చూశాక మా ఆవిడ చాలా తిట్టింది. అప్పటినుంచి నేను ఎక్కడా కనబడలేదు. ఈ మధ్య మిత్రమండలి సినిమా కోసం నాతో ఏదో రీల్ చేయించారు. అది చూశాక కచ్చితంగా నేనే ట్రోల్ అవుతానని అనిపించి ఆ రీల్ బయటకు వదల్లేదు అని బన్నీ వాసు చెప్పుకొచ్చాడు.
నిర్మాతగా..
కాగా బన్నీ వాసుది పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు. సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవగా వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా అతడు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేరాడు. తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో పార్ట్‌నర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఈమధ్యే స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరిట కొత్త బ్యానర్ ప్రారంభించాడు. ఈ బ్యానర్‌పై బన్నీ వాసు.. మిత్ర మండలి సినిమా నిర్మిస్తున్నాడు.
ఈ సీన్ లో ఉంది దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ , ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు. 😃#LittleHearts #Aarya
pic.twitter.com/bmvACGNF8s— Suresh PRO (@SureshPRO_) September 3, 2025
చదవండి: తండ్రి కాబోతున్న యంగ్ హీరో