
నటుడు అదిత్ అరుణ్ (త్రిగుణ్) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య సీమంతం వీడియోను తాజాగా పంచుకున్నాడు. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా సరే టాలెంట్ను నమ్ముకుని వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న త్రిగుణ్.. మొదట కథ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అలాగే ఆర్జీవి తెరకెక్కించిన కొండా చిత్రంతో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకులందరికి చాలా దగ్గరయ్యారు. రీసెంట్గా లైన్ మ్యాన్, ఉద్వేగం వంటి చిత్రాలతో మెప్పించారు.

త్రిగుణ్ 2023 సెప్టెంబర్లో నివేదిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తమిళనాడు తిరుపురులో జరిగిన వారి పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు ఈ దంపతులు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. దీనికంటే ముందు నివేదిత సీమంతం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆయన పంచుకున్నారు.
చెన్నైలో పుట్టి పెరిగిన త్రిగుణ్ కథ అనే చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ఆ తర్వాత త్రిగుణ్ పలు సినిమాల్లో నటించారు. వైవిధ్యభరితమైన కథలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో ఫేమస్ అయ్యాడు. పీవీఎస్ గరుడ వేగ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు, ప్రేమదేశం, కథ కంచికి.. మనం ఇంటికి, తుంగభద్ర, 24 కిస్సెస్, కిరాయి, లైన్‌మెన్ లాంటి చిత్రాల్లో నటించారు. త్రిగుణ్ ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.