
తాజాగా సలార్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో లీకైంది. ఇందులో మాసిన బట్టల్లో ఉన్న ప్రభాస్ దేనివైపో తదేకంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం సలార్. హీరోయిన్ శ్రుతీ హాసన్ ఆద్య రోల్ పోషిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజమన్నార్‌గా కనిపించనున్నాడు. సలార్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సలార్ సెట్స్ నుంచి ప్రభాస్ ఫొటో లీకైంది.
ఇందులో మాసిన బట్టల్లో ఉన్న ప్రభాస్ దేనివైపో తదేకంగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది ఫైట్ సీన్ అయ్యుంటుందా? లేదా ఏదైనా సన్నివేశమా? అని దీని గురించే చర్చిస్తున్నారు. గతంలోనూ సలార్ సెట్స్ నుంచి ఫొటోలు, వీడియోలు లీకై నెట్టింట తెగ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే! సలార్ సినిమా విషయానికి వస్తే ఇది బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటించనున్నట్లు గాసిప్. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నాడు. రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు.