
Urvashi Rautela: మారుతున్న కాలాన్ని బట్టి ఫ్యాషన్ రంగంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. పొట్టి డ్రెస్సులు, చిరిగిన జీన్స్ వేసుకోవడమే స్టైల్ అయిపోయిందిప్పుడు. అందులోనూ సినిమావాళ్లు డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో విభిన్నంగా కనిపించి అందరినీ ఆకట్టుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తమ కట్టుబొట్టుతో అభాసుపాలవుతారు కూడా! తాజాగా రిప్‌డ్ జీన్స్ వేసుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. సెలబ్రిటీల ఫొటోలు షేర్ చేసే యోగెన్ షా నెట్టింట ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఫొటోలను అప్‌లోడ్ చేశాడు.
ఇందులో నటి డెనిమ్ జాకెట్ ధరించి ఉండగా, ఆమె వేసుకున్న జీన్స్ ముందు, వెనకాల చిరిగినట్లుగా ఉంది. దీంతో నెట్టింట ఆమె మీద జోకులు పేలుతున్నాయి. 'ఊర్వశి డ్రెస్ డిజైనర్ ఎవరో పట్టుకోండి', 'అమ్మ బాబోయ్, ఇది డ్రెస్సా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా ఆమెను బిచ్చగత్తెతో పోలుస్తున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను సమర్థిస్తున్నారు. 'తను ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి?', 'ఆమె కోట్లు సంపాదిస్తోంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనకు నచ్చినట్లు బతికే హక్కుంది. ఆమెను ప్రశ్నించడానికి మీరెవరు?' అంటూ మద్దతుగా కామెంట్లు చేశారు.