NCPCR Asks Netflix To Stop Streaming Bombay Begums Over Inappropriate Portrayal Of Children - Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌కు ఎన్సీపీసీఆర్‌ నోటీసులు

Mar 12 2021 4:56 PM | Updated on Mar 12 2021 7:59 PM

NCPCR Issues Notice To Netflix To Stop Streaming Bombay Begums‌ - Sakshi

దానిపై  24 గంటల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణలో నివేదికలో అంశాలు అసత్యమని తెలిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని పేర్కొం

‘బాంబే బిగమ్స్‌’వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్సీపీసీఆర్) నోటీసులు అందజేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ బాలల హక్కులకు బంగం కలిగించే విధంగా ఉందని, దానిపై  24 గంటల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణలో నివేదికలో అంశాలు అసత్యమని తెలిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామాని పేర్కొంది. 

ఈ వెబ్‌ సిరీస్‌లో బాలలను అనుచితంగా చిత్రీకరించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ రకమైన కంటెంట్ యువతను తప్పుదోవ పట్టించడమే కాకుండా బాలల హక్కులను దుర్వినియోగం చేస్తుందరని కమిషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వెబ్‌ సీరీస్‌లో మైనర్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడటంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్టు చూపించారని ఆరోపణలో వచ్చిన నేపథ్యంలో ఎన్సీపీసీఆర్ నోటీసులు అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement