అన్నాత్తే షూటింగ్‌: హైదరాబాద్‌ వచ్చిన నయన్‌

Nayanthara Landed In Hyderabad For Annathe Shooting - Sakshi

‘అన్నాత్తే’ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు నయనతార. రజనీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆరంభమైన ఈ సినిమా షూటింగ్‌లో రజనీ పాల్గొంటున్నారు.

మంగళవారం నయనతార కూడా హైదరాబాద్‌ వచ్చారు. ఓ చార్టెర్డ్‌ ఫ్లయిట్‌లో ఆమె షూటింగ్‌ స్పాట్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది మొన్నటివరకు రజనీ, జగపతిబాబు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు రజనీ–నయన కాంబినేషన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తారని ఊహించవచ్చు. ఈ ఏడాది నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

చదవండి:  నిద్రమాత్రలు మింగి టీవీ న‌టుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top