MAA Elections 2021: ప్రచారంలో భాగంగా ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మంగళవారం నామినేషన్‌ల పర్వం కూడా ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న మంచు విష్ణు ప్యానల్, ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ అయిపోయారు.
చదవండి: ఎవరు పడితే వారు సీటులో కూర్చుంటే ‘మా’కు మరక: నరేశ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. తన ప్యానల్ సభ్యులతో ఉన్న పాంప్లేట్ ఫొటో షేర్ చేస్తూ.. ‘#MaaElections2021.. మీ ఓటే మీ గొంతు.. ‘మా’ హితమే మా అభిమతం.. మనస్సాక్షిగా ఓటేద్దాం.. ‘మా’ ఆశయాలను గెలిపిద్దాం..’ అంటూ చేతులు జోడించిన చేతుల ఏమోజీలను జత చేశాడు. కాగా అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
చదవండి: ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నామినేషన్ దాఖలు.. లిస్టులో ఉన్నది వీరే..
#MaaElections2021 your VOTE is your VOICE.. "మా"హితమే
మా అభిమతం... మనస్సాక్షిగా ఓటేద్దాం..
"మా" ఆశయాలను గెలిపిద్దాం..🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/krae74z9U7— Prakash Raj (@prakashraaj) September 29, 2021
మీ అభిప్రాయం చెప్పండి