చైసామ్‌ విడాకులు.. ఏంటీ? ఏం జరిగింది?

Chaysam Divorce Trending In Social Media - Sakshi

సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీసిన చైసామ్‌ విడాకులు

టాలీవుడ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారే వార్త సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. సమంతా తాను విడాకులు తీసుకోబోతున్నట్టు శనివారం మధ్యాహ్నం 3:31 నిమిషాలకు నాగ చైతన్య ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  ఆ వెంటనే అభిమానులు భారీ స్థాయిలో స్పందించారు. ఎందుకు విడాకులు తీసుకుంటారు ? ఏం జరిగిందంటూ అభిమానులు వేల సంఖ్యలో రీ ట్వీట్‌లు చేశారు.  వీరిద్దరు భవిష్యత్తులో మరింత పై స్థానాలకు చేరుకోవాలని మరికొందరు విష్‌ చేశారు. భార్యభర్తలు అన్నాక అపార్థాలు సహజమని, సర్థుపోయి కలిసి ఉండాలంటూ మరికొందరు సోషల్‌ మీడియాలో ఈ జంటను రిక్వెస్ట్‌ చేశారు.

ఆ వెంటనే సమంత..
నాగ చైతన్య ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన కొద్ది సేపటికే సమంత సైతం అదే పోస్టును పోస్ట్‌ చేసింది. దీంతో ఇద్దరు విడాకులపై అధికారికంగా స్పందించినట్టయ్యింది. 2017 అక్టోబరు 7న వీరిద్దరు గోవాలో పెళ్లి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి విహహబంధానికి నాలుగేళ్లు పూర్తవుతాయనగా విడాకుల విషయం వెలుగు చూసింది. దాంతో సోషల్‌ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

చై-సామ్‌ పెళ్లినాటి  ఫోటోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top