Bandla Ganesh: బండ్ల గణేశ్ సంచలన నిర్ణయం

బండ్ల గణేశ్.. ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా మాట్లాడతాడో అంచనా వేయడం కూడా కష్టమే. ఆయన మాటలతో పాటు ఎదుగుదల కూడా అందరికి ఆశ్చర్య కలిగించింది. కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల.. ఉన్నట్లుండి నిర్మాత అయ్యాడు. అంతేకాదు ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక ఆ మధ్య రాజకీయాల్లోకి వెళ్లి.. అక్కడా సెన్సేషనల్ కామెంట్స్ చేసి, తిరిగి సినిమాల్లోకి వచ్చాడు. ఇక ఈ కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వ్యక్తిగత విషయాలతో పాటు సమాజంలో జరిగే ప్రతి అంశంపై స్పందిస్తుంటాడు.
సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అయితే హఠాత్తుగా బండ్ల గణేశ్ ట్వీటర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నానని ప్రకటించి షాకిచ్చాడు. . త్వరలోనే ట్విటర్ గుడ్ బై చెప్పేస్తా. నాకు ఎలాంటి కాంట్రవర్సీలు వద్దు. నా జీవితంలో వివాదాలకు తావివ్వకుండా జీవించాలని అనుకుంటున్నా’అని బండ్ల ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అతని అభిమానులు, ఫాలోవర్స్ షాక్‌కు గురయ్యారు. ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారు? అసలు ఏమైందో చెప్పండి’అంటూప్రశ్నలు వేస్తున్నారు. మరి బండ్ల గణేశ్ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానకి బలమైన కారణం ఏంటో తెలియాలంటే.. ఆయన చెప్పేవరకు వేచి చూడాల్సిందే.
త్వరలో కి ట్విట్టర్ కి గుడ్ బాయ్ చెప్పేస్తా No controversies. I don’t want any controversies in my life 🙏
— BANDLA GANESH. (@ganeshbandla) August 14, 2021