Balakrishna Unstoppable With Allu Arjun And Pushpa Team, Promo Inside - Sakshi
Sakshi News home page

Unstoppable With Allu Arjun: పుష్పరాజ్‌ ఎంట్రీ, తగ్గేదే లే అంటున్న బాలయ్య

Dec 25 2021 4:58 PM | Updated on Dec 25 2021 5:18 PM

Balakrishna Unstoppable With Allu Arjun And Pushpa Team, Promo Inside - Sakshi

బన్నీని చూడగానే బాలయ్య కూడా పుష్పరాజ్‌లా మారిపోయాడు. అతడి స్టైల్‌లో నడుస్తూ పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ! తగ్గేదేలే.. అని డైలాగ్‌ చెప్పి తొడగొట్టాడు.

Pushpa Special on Unstoppable: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాప్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు బ్రహ్మానందం, నాని, అనిల్‌ రావిపూడి, రాజమౌళి వంటి ఎందరో సెలబ్రిటీలు అతిథులుగా వచ్చారు. తాజాగా పుష్పరాజ్‌ అలియాస్‌ అల్లు అర్జున్‌ సైతం ఈ షోలో సందడి చేయనున్నాడు. ఈమేరకు ప్రోమో రిలీజ్‌ చేసింది ఆహా. ఇందులో బన్నీతో పాటు రష్మిక మందన్నా, సుకుమార్‌ సైతం స్టేజీపై కనిపించారు. 

బన్నీని చూడగానే బాలయ్య కూడా పుష్పరాజ్‌లా మారిపోయాడు. అతడి స్టైల్‌లో నడుస్తూ.. 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా? ఫైరూ! తగ్గేదేలే..' అని డైలాగ్‌ చెప్పి తొడగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది. అఖండ, పుష్ప కలిసి చేసిన హడావుడి చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటే ఆహా మాత్రం ఈ ఎపిసోడ్‌ ఎప్పుడు ప్రసారం చేస్తారన్న వివరాలు ఇంతవరకూ వెల్లడించనేలేదు. ఇక బాలయ్య హోస్టింగ్‌ చేయడమేంటి? అని విమర్శించినవాళ్లతోనే ఇదిరా హోస్టింగ్‌ అనిపించేలా చేశాడు ఎన్‌బీకే. ఫుల్‌ ఎనర్జీతో షోను సింగిల్‌ హ్యాండ్‌తో నడిపించడమే కాక ఎలాంటి ఈగోలు లేకుండా అందరు హీరోలను కలుపుకుపోతున్న బాలయ్య తీరుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement