
నటిగా సూపర్ హిట్ అయిన ఆలియా భట్ నిర్మాతగా మాత్రం ఇంకా హిట్ స్టేటస్‌ను సాధించలేక పోతున్నారు. ఎటర్‌నల్ సన్‌షైన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థనుప్రారంభించిన ఆలియా భట్, ‘డార్లింగ్’, జిగ్రీస్’ సినిమాలను నిర్మించారు. ఈ రెండు సినిమాల్లోనూ ఆలియా భట్ లీడ్ రోల్ చేశారు. కానీ ఈ రెండు చిత్రాలూ హిట్ కాలేక పోయాయి. ఇప్పుడు ఆలియా భట్ మరో సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారని బాలీవుడ్ సమాచారం.
అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేసిన శ్రీతీ ముఖర్జీ ఓ కాలేజీ క్యాంపస్ డ్రామా కథను సిద్ధం చేసి, ఈ కథను ఆలియా భట్‌కు వినిపించారట. ఆలియాకు ఈ కథ నచ్చడంతో నిర్మించేందుకు ఓకే అన్నారట. అయితే కాలేజ్ క్యాంపస్ డ్రామా కాబట్టి తాను నటించకుండా, నూతన నటీనటులకు చాన్స్ ఇవ్వాలని ఆలియా భావిస్తున్నారని, ఆ దిశగా ఈ బ్యూటీ ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం.
ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ స్టార్ట్ కానుందని బాలీవుడ్ టాక్. మరోవైపు నటిగా ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిసస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్షన్‌లోని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.