మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: ఆలియా | Alia Bhatt Is COVID Negative And Back To Work After Isolating | Sakshi
Sakshi News home page

మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు: ఆలియా

Mar 12 2021 12:08 AM | Updated on Mar 12 2021 1:38 AM

Alia Bhatt Is COVID Negative And Back To Work After Isolating - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌కి కరోనా నెగటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారామె. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘గంగూభాయ్‌ కథియావాడీ’ సినిమాలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు ఆలియా. ఆ సినిమా చిత్రీకరణలో ఉండగా దర్శకుడు భన్సాలీకి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌కి కూడా అదే రోజు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఓ వైపు తాను నటిస్తున్న చిత్ర దర్శకుడు, మరోవైపు ప్రియుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో తనకు కరోనా లక్షణాలు లేకున్నా సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు ఆలియా.

‘‘డాక్టర్ల సలహా మేరకు కరోనా పరీక్ష చేయించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. గురువారం నుంచే షూటింగ్‌ పాల్గొంటున్నాను. మీ ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు. కోవిడ్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండండి’’ అని పేర్కొన్నారు ఆలియా. కాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఆలియా భట్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వారంలో ఈ చిత్రం షూటింగ్‌లో ఆమె పాల్గొనాల్సి ఉండగా, హోమ్‌ క్వారంటైన్‌లో ఉండటంవల్ల, ఈ సినిమాకి ఇచ్చిన డేట్స్‌ అటూ ఇటూ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు నెలకొన్నాయి. కానీ ఆలియాకి నెగటివ్‌ వచ్చింది కాబట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఎలాంటి అటంకమూ లేదు. ఇందులో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా నటిస్తున్నారామె.  

చదవండి: (రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్‌లో ఆలియా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement