
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాధా కృష్ణకుమార్‌తో ‘రాధే శ్యామ్’ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ ఓం రౌత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ మరో పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధే శ్యామ్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.
ఈ తరుణంలో నాగ్ ఆశ్విన్‌తో ప్రభాస్ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా ప్రభాస్-నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వెలువడింది. అంతేగాక ఇందులో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనేలు కీలక పాత్రలు పోషిస్తున్నారనే విషయం కూడా తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇదిలా ఉండగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ మూవీలో బిగ్‌బీ, దీపికాలతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటీనటులను కూడా తీసుకునేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో మెయిన్ విలన్‌గా టాప్ బాలీవుడ్ నటుడిని తీసుకోగా.. మరో 7 మంది ప్రముఖ నటీనటులను తీసుకోవాలనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్. మొత్తానికి తన సినిమాలో 10 మంది బాలీవుడ్ నటినటులతో యాక్టింగ్ చేయించి.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ప్రభాస్ 21వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్దం బ్యాక్ డ్రాప్‌లో రానున్నట్లు తెలుస్తోంది.