
పంట రుణాలకు ప్రదక్షిణలు
● పట్టాలు ఉన్నా కనికరించని బ్యాంకర్లు ● నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్న వైనం ● మూడేళ్లుగా తిరుగుతున్న పోడు రైతులు ● ప్రజావాణిలో కలెక్టర్‌కు అన్నదాతల ఫిర్యాదు
రైతుభరోసా వచ్చినా..
మంచిర్యాలఅగ్రికల్చర్: అటవీ ప్రాంతంలో నివా సం ఉంటున్న గిరిజన రైతులు పాతికేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాల కోసం అధికారుల చుట్టూ తిరిగారు. ప్రస్తుతం పట్టా పాసు పుస్తకాలున్నా పంట రుణం కోసం మూడేళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుబంధు, రైతు భరోసా సైతం అందుతున్నా బ్యాంకర్లు పంటరుణాలు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నా రు. పంట రుణాలు అందించడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా నిబంధనలు అమలు చేస్తున్నారని బ్యాంకర్ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టా పాసు పుస్తకాలున్నా.. పంటలు సాగు చేస్తున్నా.. మాకెందుకు రుణాలు ఇవ్వడంలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. గతేడాది వానాకాలం తాండూర్ మండలం పెగడపల్లికి చెందిన పోడురైతులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొస్తే రుణం మంజూరు చేశారు. అది కూడా ఎకరాలతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున అందజేశారు.
ఏళ్ల తరబడిగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారు. అప్పటి నుంచి పంట రుణాలు తీసుకోవడంతో పాటు రుణమాఫీ సైతం వర్తించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2023లో 13 మండలాల్లోని 3821.24 ఎకరాలకుగానూ 1847 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందజేసింది. రైతుబంధు నగదు సైతం ఖాతాలో జమచేసింది. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరో సా ఎకరానికి రూ.6 వేల నగదు అందుకుంటున్నా రు. కానీ ఽపహాణి, వన్‌బి ఇస్తేనే రుణాలు ఇస్తామని బ్యాంకర్లు నిబంధనలు విధిస్తున్నారు. కానీ ఈ పో డు భూములకు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల నుంచి పహాణి, వన్‌బి రావడం లేదు. దీంతో రుణా లు ఇవ్వడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.