
‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనతో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌తో కలిసి పలు దుకాణాల్లో ప్రధాని చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి ఎంతగానో సహకరించాయని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి కలెక్టర్ ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.