జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అరకొరగా వైద్యం అందుతోంది. అపరిశుభ్రత, అసౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘సాక్షి’ శుక్రవారం విజిట్‌ నిర్వహించింది. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అరకొరగా వైద్యం అందుతోంది. అపరిశుభ్రత, అసౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘సాక్షి’ శుక్రవారం విజిట్‌ నిర్వహించింది.

Jul 5 2025 6:10 AM | Updated on Jul 5 2025 6:10 AM

జిల్ల

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్రత

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. వరండా, పలు గదుల్లో రెండేళ్లుగా స్లాబ్‌ పెచ్చులూడుతోంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది భయపడుతున్నారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆవరణలో నూతనంగా 450పడకలతో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి కావస్తుండడంతో ప్రస్తుత భవనంలో మరమ్మతులు చేపట్టడం లేదు. ఇప్పటికే నూతన భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యమవుతోంది. వర్షాకాలం తర్వాతే అందుబాటులో రానుండగా.. మరో మూడు నెలలు ఇబ్బందుల్లోనే ఆస్పత్రి నిర్వహించాల్సి ఉంది. ఆస్పత్రిలో వెలువడే బయోవేస్టేజ్‌, చెత్తను కలిపి ఆస్పత్రి వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, మహా రాష్ట్ర నుంచి నిత్యం 500కు పైగా రోగులు(ఓపీ) వస్తుంటారు. అన్ని విభాగాల్లో వైద్యులు లేకపోవడం, అపరిశుభ్రత, ఇతరత్రా కారణాలతో రోగుల సంఖ్య తగ్గింది. అత్యవసర విభాగంలో పది మంది వైద్యులకు గాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు మెటర్నిటీ లీవులో వెళ్లారు. దంత, కంటి వైద్యులు లేరు. గుండె వైద్య నిపుణుడు డిప్యూటేషన్‌పై ఖమ్మంలో పని చేయగా.. ఇటీవల డిప్యూటేషన్‌ రద్దు చేసినా ఇక్కడికి రాకపోవడంతో వైద్యసేవలు అందుబాటులో లేవు. మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రసూతి విభాగంలో 14మంది గైనకాలజిస్టులకు ఆరుగురే పని చేస్తున్నారు. నవజాత శివు సంరక్షణ కేంద్రంలో అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా.. రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఎనిమిది గాను ముగ్గురే ఉన్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలం లేక, ఇష్టారీతిన పార్కింగ్‌తో అంబులెన్స్‌లు లోపలికి రాని పరిస్థితి ఏర్పడుతోంది.

వైద్యుల నియామకానికి నివేదించాం

మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు నివేదించాం. పదోన్నతులతో కొందరిని, నూతనంగా నియామకం చేపట్టి మరికొందరిని కేటాయించే అవకాశం ఉంది. ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవడంతోపాటు వర్షాకాలంలో రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. పాత భవనం కావడం వల్ల కొన్ని ఇబ్బందులున్నా, నూతన భవనం పూర్తయితే పూర్తిస్థాయి సౌకర్యాలు అందుతాయి.

– డాక్టర్‌ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ప్రారంభం కాని పక్కా భవనం

లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి పాత రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. 30పడకల పక్కా ఆస్పత్రి భవనం పూర్తి కాగా త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిది మంది వైద్యులకు గాను ఐదుగురే ఉన్నారు. వీరిలో ముగ్గురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్‌నర్సులు 14మంది ఉండాల్సి ఉండగా.. ఆరుగురే ఉన్నారు. వీరిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై మంచిర్యాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంఎన్‌వోలు నలుగురికి గాను ఒక్కరే ఉన్నారు. ఎఫ్‌ఎన్‌వో నలుగురికి గాను ఒక్కరూ లేరు.

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,1
1/5

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,2
2/5

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,3
3/5

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,4
4/5

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,5
5/5

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement