
వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఈవో యాదయ్యతో కలిసి జిల్లా అధికారులు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల ప్రిన్సిపాళ్లతో విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మహనీయుల మార్గంలో నడవాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహనీయుల మార్గంలో నడవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.పురుషోత్తం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, క్రీడా శాఖ అధికారి హనుమంత్‌రెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
లక్సెట్టిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, జూనియర్ కళాశాల, ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నూతన భవ నం నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాలల ప్రిన్సిపాల్, వైద్యులు పాల్గొన్నారు.