
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
వేమనపల్లి: మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో మండలంలోని నీల్వాయి జెడ్పీఎస్‌ఎస్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం గిరిధర్‌రెడ్డి, పీఈటీ దాసరి మల్లేశ్ తెలిపారు. వశాక రజిత, అల్వియ మహివీన్, చింతల మహేశ్వరి, కొట్రంగి అనూష సత్తాచాటారు. హన్మకొండలో జవహర్‌లాల్ స్టేడియంలో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.