అనుమానాస్పదంగా యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా యువకుడి మృతి

Jul 6 2025 7:11 AM | Updated on Jul 6 2025 7:11 AM

అనుమా

అనుమానాస్పదంగా యువకుడి మృతి

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి అమ్మాగార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన తడక దినేశ్‌ (29) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నిద్రమాత్రలు లభించాయని, ఆ మాత్రలు వేసుకుని దినేశ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పట్టణ ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. కాగా, అమెరికాలో ఉన్న కూతురు మౌనిక వద్దకు తల్లిదండ్రులు పద్మావతి, రవి ఇటీవల వెళ్లారు. దీంతో వారు తిరిగి వచ్చేవరకు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. వారి ఫిర్యాదు అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తామని పట్టణ ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

సోన్‌: పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాదాపూర్‌కు చెందిన సల్ల భోజవ్వ (54)కు కుమారుడు నరేశ్‌ ఉన్నారు. నరేశ్‌కు పెళ్లి చేసింది. పదేళ్ల క్రితం భర్త నరేశ్‌తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భోజవ్వ బాధపడుతుండేది. కోడలు రావడం లేదని మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. కుమారుడు నరేశ్‌ గమనించి నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. కుమారుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు.

మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన అనీస్‌ రైల్వేస్టేషన్‌ ఎదుట నుంచి వెళ్తున్న మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. పలువురు షీ టీంకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలు

ఇచ్చోడ: అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దేవుల్‌నాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ గంభీర్‌సింగ్‌ శనివారం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నాడు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తప్పించుకునే క్రమంలో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గంభీర్‌సింగ్‌ను అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మద్యం తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఏఎస్సై దివాకర్‌, కు టుంబీకులు తెలిపిన వివరా లు.. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ఒల్లెపు వెంకటేశ్‌(40), సుజాత దంపతులు. వీరికి కుమారుడు గణేశ్‌, కూతుళ్లు బిందు, దివ్య ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవా రు. వెంకటేశ్‌ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి రావడంతో తరచూ గొ డవలు జరిగేవి. ఎదిగిన పిల్లలు ఉన్నారని, మద్యం తాగుడు మానేయాలని భార్య మందలించడంతో వెంకటేశ్‌ మనస్తాపం చెందాడు. శుక్రవారం ఎఫ్‌ సీఐ గోదాము వెనుకాల మద్యం మత్తులో పురుగు ల మందు తాగి చనిపోతున్నానని కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

అనుమానాస్పదంగా   యువకుడి మృతి1
1/1

అనుమానాస్పదంగా యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement