
‘బస్తా ఇస్తలేరు.. పట్టించుకుంటలేరు’
కౌటాల(సిర్పూర్): తొమ్మిది రోజుల నుంచి అధికా రుల చుట్టూ తిరిగినా.. ఒక్క యూరియా బస్తా కూడా ఇస్తలేరని చింతలమానెపల్లి మండల రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కౌటాల రైతు వేదిక ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులు ఆపి కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవ డం లేదన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపులు గాయాల్సి వస్తుందని వాపోయారు. సరిపడా ఎరువులు పంపిణీ చేయకుంటే వ్యవసాయం చేయలా వద్దా అని ప్రశ్నించారు. యూరి యా బస్తాల కోసం చింతలమానెపల్లికి వెళ్తే.. కౌటాల వెళ్లాలని చెబుతున్నారని, కౌటాలకు వెళ్తే అక్కడికే వెళ్లాలంటున్నారని తెలిపారు. చింతలమానెపల్లిలోనే అక్కడి రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. కాగా, యూరియా బస్తాలు అందజేస్తామని కౌటాల ఏవో ప్రేమలత తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. కౌటాల, చింతలమానెపల్లి మండలాల రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల బందోబస్తు మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు.