
పంట మార్పిడితో సుస్థిర ఆదాయం
నెన్నెల: రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ అన్నారు. మండలంలోని ఖర్జిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు అవగాహన కల్పించా రు. రైతులు సాంకేతిక విషయాలను అవలంబి స్తూ కొత్త వంగడాలను సాగు చేయాలని సూచించారు. పురుగుల మందులు, ఎరువుల వా డకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, రశీదులను భద్రపర్చి నష్టపరిహారాన్ని పొందడం, తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ సురేఖ మాట్లాడుతూ రైతులు వరి, పత్తి పంటలు మాత్రమే కాకుండా ఇతర పంటలు కూడా సాగు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మర్ ఐడీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొ క్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, నాగరాజు, నెన్నెల ఏఓ సృజన, ఏఈఓ రాంచందర్ పాల్గొన్నారు.