● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు రూ.81 కోట్ల చొప్పున మంజూరు ● 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు రూ.81 కోట్ల చొప్పున మంజూరు ● 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయింపు

May 12 2025 12:21 AM | Updated on May 12 2025 12:21 AM

● మంచ

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు

మంచిర్యాలక్రైం: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పా టు తర్వాత, జిల్లా న్యాయస్థానాలను కూడా ఏర్పా టు చేశారు. అయితే తాత్కాలిక భవనాల్లో వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో న్యాయ నిర్మాణ్‌ ప్రణా ళికలో భాగంగా జిల్లా న్యాయస్థానాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.81 కోట్లు కేటాయించింది. దీంతో త్వరలో కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 2004లో కోర్టులు ఏర్పాటయ్యాయి. రెండు దశాబ్దాలుగా అద్దెభవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కోర్టుల సంఖ్య 9కి పెరిగినా సొంత భవనాలు లేకపోవడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు మౌలిక సౌకర్యాల లోపం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది, దీంతో దీర్ఘకాల నిరీక్షణకు తెరపడనుంది.

రూ.162 కోట్లతో ఆధునిక భవనాల నిర్మాణం

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో న్యాయ నిర్మాణ ప్రణాళిక కింద కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులను భరిస్తాయి. మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం రూ.162 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ. 81 కోట్లు కేటాయించారు. ఈ భవనాలు నాలుగు అంతస్తులతో, ఒక బేస్‌మెంట్‌తో ఆధునిక డిజైన్‌లో నిర్మిస్తారు. బేస్‌మెంట్‌లో 88 కార్లు, 62 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉంటుంది. ప్రతీ అంతస్తు 43 వేల నుంచి 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం కోర్టు భవనం 2,87,743.58 చదరపు అడుగుల వరకు ఉంటుంది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉండేలా డిజైన్‌ చేశారు. ఈ భవనంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు.

2027 నాటికి పూర్తి

కోర్టు భవనాల నిర్మాణం కోసం టెండర్‌ ప్రక్రియ ఈ నెల రెండో వారంలో ఖరారు కానుంది. టెండర్లు ఖరారైన వెంటనే, పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన 24 నెలల్లో, అంటే 2027 నాటికి పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భవనాలు ఆధునిక సౌకర్యాలతో, తూర్పు అభిముఖంగా, విశాలమైన గాలి, వెలుతురు సౌకర్యాలతో నిర్మిస్తారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్‌ స్ట్రక్చర్‌ ఇప్పటికే సిద్ధం చేయబడింది.

స్థలం కేటాయింపు..

మంచిర్యాల జిల్లాగా ఏర్పడక ముందే పలు కోర్టులు మంజూరయ్యాయి. 2004 నుంచి న్యాయస్థానా లు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచే కోర్టులకు సొంత భవనాలు కావాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినా స్థల కేటాయింపు విషయంలో రాజకీయ జోక్యం కా రణంగా జాప్యం జరిగింది. ఈ క్రమంలో 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, నిర్మల్‌, కుమురంభీ ఆసిఫాబాద్‌ జిల్లాలుగా ఏర్పడ్డాయి. దీంతో కొత్త జిల్లాలకు కోర్టులు ఏర్పాటు అవశ్యమైంది. 2022 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లా కోర్టులను విభజించి కొత్త జిల్లాల వారీగా కోర్టులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో మంచి ర్యాల జిల్లా కోర్టు కోసం నస్పూర్‌లో ఐదెకరాల భూమిని కలెక్టర్‌ భారతి హోళ్లికేరి కేటాయించారు. ఈస్థల కేటాయింపు కోర్టు భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. తాజాగా కొత్త భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి.

నిరీక్షణ ఫలించింది..

మంచిర్యాల జిల్లా కాక ముందే స్థానిక అవసరాల దృష్ట్యా పలు కోర్టులు ఏర్పటయ్యాయి. 2004 నుంచి అద్దె భవనాల్లోనే కోర్టులు కొనసాగుతున్నాయి. సొంత భవనాల కోసం 20 ఏళ్లుగా విన్నవిస్తూ వస్తున్నాం. ఎట్టకేలకు మా నిరీక్షణ ఫలించింది. జిల్లా కోర్టు భవన నిర్మాణానికి రూ.81 కోట్లు మంజూరు కావడం సంతోషంగా ఉంది. కోర్టు భవన నిర్మాణంతో న్యాయవాదులు, కక్షిదారుల సమస్యలు తొలగిపోతాయి.

– బండవరం జగన్‌, బార్‌ అసొసియేషన్‌ అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు1
1/2

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు2
2/2

● మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement